కోలీవుడ్ నుంచి చాలా కాలం తర్వాత ఓ స్టార్ హీరో సినిమా వస్తుంది అని అంతా ఎగ్జైటెడ్ గా ఉంటే వారికి ఇపుడు షాకింగ్ ట్విస్ట్ తగిలింది. స్టార్ నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన మాస్ అండ్ ఎమోషనల్ మెసేజ్ డ్రామానే ‘కరుప్పు’.
తెలుగులో ‘వీర భద్రుడు’ గా రిలీజ్ కి తీసుకొస్తున్న ఈ సినిమా నేడే థియేటర్స్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఈ సినిమా తెలుగు సహా తమిళ మార్నింగ్ షోస్ అన్నీ రద్దు అయ్యిపోయాయి. దీనిపై నిర్మాత కూడా అభిమానులని క్షమాపణ కోరడం జరిగింది. అయితే కొన్ని ఆర్ధిక సమస్యలు నేపథ్యంలో సినిమా విడుదల నిలిచిపోయింది అని షాకింగ్ ట్విస్ట్ ఇపుడు వినిపిస్తుంది.
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలే చివరి నిమిషం వరకు వచ్చి షోస్ ఆగిపోయిన సంగతి చూసాం ఇప్పుడు ఇదే తంతు సూర్య సినిమాకి కూడా ఎదురు కావడం అనేది బాధాకరమే అని చెప్పాలి. మరి దీనిని సెటిల్ చేసి తర్వాతి షోస్ అయినా మొదలవుతాయో లేదో అనేది వేచి చూడాలి.
Because of unavoidable causes 9am displays shall be cancelled for Karuppu. Our honest apologies to everybody!
— SR Prabu (@prabhu_sr) May 13, 2026
The put up ట్విస్ట్: మళ్ళీ అదే తంతు.. సూర్య సినిమా మార్నింగ్ షోస్ రద్దు! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
