Thu. May 14th, 2026
Tollywood : టాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. ఈ వివాదం ప్రధానంగా రెండు గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై నడుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో శిరీష్‌, సునీల్‌ నారంగ్‌, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి వంటి వారు మరో పక్షాన నిలిచారు.

ఈ గొడవకు ప్రధాన కారణం థియేటర్ల రెంట్ మరియు పర్సంటేజ్ విధానం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘పర్సంటేజ్’ విధానం కావాలని డిమాండ్ చేస్తుండగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాత్రం ‘రెంటల్’ విధానాన్నే సమర్థిస్తోంది. నైజాం ఏరియాలో గత నెల రోజులుగా సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం అమలవుతోంది. అయితే ఈ గొడవ కారణంగా ఇటీవలే విడుదలైన ‘జెట్లీ’ సినిమా సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శనకు నోచుకోలేకపోయింది. జూన్ 4న చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది. ఈ భారీ చిత్రం రిలీజ్‌కు ముందు సింగిల్ స్క్రీన్ల సమస్య తలెత్తడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించకపోతే ఓపెనింగ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నాగవంశీ చెప్పినట్టు ఈ వివాదాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్తే  పెద్ది ఇష్యూ వరకు సాల్వ్ చేస్తారా లేదా  ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి రెండు గ్రూపులను కూర్చోబెట్టి అసలు సమస్యను పరిష్కరిస్తారాఅన్నది చూడాలి.