Thu. May 14th, 2026

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. అయితే తన గత చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. కానీ తనకి మంచి మార్కులు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ రామ్ వైల్డ్ స్టెప్ తీసుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి సినిమాలతో తనలోని మాస్ అండ్ వైల్డ్ యాంగిల్ ని చూపించిన రామ్ పోతినేని ఇప్పుడు మరోసారి ఆ ట్రాక్ లోకి వెళుతున్నాడు. లేటెస్ట్ గా అందుకు సంబంధించిన క్రేజీ ప్రీ లుక్ పోస్టర్ వచ్చింది. ఇందులో తన చేతిలో మైక్ అది కూడా రక్తంతో తడిసి కనిపించడం అనేది మరింత ఆసక్తిగా మారింది.

దీనిపై ఫుల్ క్లారిటీ అయితే రేపు రామ్ బర్త్ డే కానుకగా మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేయనున్నట్టుగా ఇపుడు ఖరారు అయ్యింది. అయితే రామ్ పోతినేని ఈ చిత్రానికి కథ రాసుకున్నట్టు సినీ వర్గాల్లో టాక్ ఉంది. అంతే కాకుండా దర్శకునిగా కూడా మారే ఛాన్స్ ఉన్నట్టు మరో రూమర్ కూడా ఉంది. సో ఇవన్నీ రేపే రివీల్ అవుతాయి అని చెప్పవచ్చు.

The put up వైల్డ్ యాక్షన్ లోకి రామ్ పోతినేని.. బిగ్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.