Thu. May 14th, 2026
Tollywood Movie Shootings: వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా స్టార్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?

టాలీవుడ్‌లో ఈ మధ్యనే డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలుపెట్టి, ప్రస్తుతానికి బడా సినిమాలు చేస్తూ, బడా స్టార్లతో పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న ఓ నిర్మాణ సంస్థ సంచలన అనౌన్స్మెంట్ దిశగా ముందుకు వస్తోంది. నిజానికి ప్రారంభించిన కొద్ది కాలంలోనే టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ బడా హిట్లు కొట్టింది ఈ సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ ఒక ఫిలిం సిటీ నిర్మించి, టాలీవుడ్‌కి వరల్డ్ క్లాసు షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 ఎకరాల భూమిని అక్వైర్ చేసిన ఈ నిర్మాణ సంస్థ, భారీ ఎత్తున ఫిలిం సిటీ నిర్మాణం చేసేందుకు సిద్దమవుతోంది. ఈమేరకు పనులు మొదలు పెట్టి త్వరలోనే టాలీవుడ్ షూటింగ్స్ కోసం ఈ ఫిలిం సిటీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. నిజానికి, ప్రస్తుతానికి షూటింగ్స్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీ ఏకైక అవుట్‌డోర్ ఫిలిం సిటీగా నిలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ ఫిలిం సిటీ కూడా అందుబాటులోకి వస్తే, సినిమా షూటింగ్స్‌కి మరింత సౌలభ్యం కలిగినట్లు అవుతుంది.

నిజానికి ఈ భారీ నిర్మాణ సంస్థ చేతిలోనే ఎన్నో సినిమాలు ఉన్నాయి. వీరు ఎంతోమంది స్టార్ డైరెక్టర్లకు, స్టార్ టెక్నీషియన్లకు, స్టార్ హీరోలకు సైతం అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. సొంత ఫిలిం సిటీ ఉంటే బెటర్ అని భావించి, గత కొన్నాళ్లుగా ఈ మేరకు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.