ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన కెరీర్ 111వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఓ భారీ హిస్టారికల్ సినిమాగా ప్లాన్ చేసిన ఈ చిత్రం తర్వాత సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మారింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగునున్న సంగతి తెలిసిందే.
ముంబై వీధుల్లో ఓజి సినిమా షూట్ చేసిన లొకేషన్స్ లోనే బాలయ్య కూడా వీర విహారం చేస్తున్నారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఈ సినిమా విషయంలో తెలుస్తుంది. ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ నేపథ్యమే కాకుండా దేశభక్తి ఎలిమెంట్ కూడా ఉంటుంది అని లేటెస్ట్ టాక్. గోపీచంద్ లాస్ట్ చిత్రం జాట్ లో కూడా దేశభక్తి అంశం ఉంది. సో ఈసారి బాలయ్యతో మరో లెవెల్లో టచ్ చూపించనున్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The submit ఇంట్రెస్టింగ్.. ‘బాలయ్య 111’ లో ఈ ఎలిమెంట్ కూడా? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
