విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా చాలా అగ్రెసివ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేయగా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కొత్తగా ప్రారంభమైన అల్లు సినిమాస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ రెడ్ కార్పెట్ ప్రీమియర్ షోను ప్లాన్ చేశారు. జూలై 2వ తేదీ రాత్రి 9 గంటల నుంచి సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రీమియర్‌తో సినిమాపై ఉన్న బజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్‌ఐకె స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The submit నాగబంధం’ రెడ్ కార్పెట్ ప్రీమియర్‌కు డైట్, టైమ్ లాక్..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
