Mon. Jun 29th, 2026

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన ఏ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తోందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట.

పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

The put up ‘రౌడీ జనార్దన’ కోసం స్పెషల్ సాంగ్ ? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.