Mon. Jun 29th, 2026

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం ఆగస్టు నాలుగో వారంలో జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరో భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా బలంగా వినిపిస్తోంది.

కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనుంది.

The submit ఆగస్టు నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.