Mon. Jun 29th, 2026

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా జూన్ 22 నుండి షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ల పై కామెడీ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది

ఇక ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్.

The put up లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.