Mon. Jun 29th, 2026

యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ అవైటెడ్ పాన్‌-ఇండియా సినిమా “నాగబంధం”. 2026 జులై 3న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం పై బాగా బజ్ క్రియేట్ అయిందని.. కచ్చితంగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి నిజంగానే నాగబంధం పై బజ్ క్రియేట్ అయిందా ?, మేకర్స్ ఆశిస్తున్నట్టుగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయా ?.. వాస్తవానికి స్టార్ హీరో లేకపోవడం, పైగా పేరు ఉన్న దర్శకుడు కాకపోవడం ఈ సినిమాకి ప్రతికూలం కానుంది. ఈ లెక్కన భారీ ఓపెనింగ్స్ రాకపోయినా.. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్స్ అయితే కచ్చితంగా పెరుగుతాయి.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. భారీ సినిమాల నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రాబోతుంది. అన్నట్టు ‘నాగబంధం’ నిడివి సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఖరారైంది. మరి సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం యొక్క జానర్ మరియు కథాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అత్యున్నత నిర్మాణ విలువలు మరియు విస్తృతమైన VFX పనులతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నగార్కర్ మరియు రిషబ్ సాహ్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

The submit నిజంగానే ఓపెనింగ్స్ వస్తాయా ?, అసలు బజ్ నిజమేనా ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.