Tue. Jul 7th, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు సాలిడ్ లైనప్ తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ సినిమా గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ చేయడం కేజ్రీగా మారింది. అయితే ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయ్యిన తర్వాత సోషల్ మీడియాలో మరోసారి డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల అనుబంధం కోసం అందరికీ తెలిసిందే.

ఇద్దరూ సోషల్ మీడియాలో బావ అంటూ పిలుచుకుంటూ ఫ్యాన్స్ కి బోలెడంత ఆనందాన్ని అందించారు. ఇలా అల్లు అర్జున్ తో కొరటాల శివ అనౌన్స్ చేసిన సినిమా దేవర అని అదే తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది అనే టాక్ ఉంది. అప్పట్లో వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా దేవర నేపథ్యం ఛాయలు కనిపించాయి.

ఇక లేటెస్ట్ గా గాడ్ ఆఫ్ వార్ లో కూడా ఉన్న డీటెయిల్స్ అప్పట్లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన పోస్టర్ లో కూడా ఉండడం గమనార్హం దీనితో మరోసారి బావ వద్దకే తన సినిమా వెళ్ళింది అనే టాక్ అభిమానుల్లో మొదలైంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఆ స్కేల్ ని మ్యానేజ్ చేయగలిగే మార్కెట్, సామర్ధ్యం ఇద్దరికీ ఉన్నాయి. దీనిని పాజిటివ్ గానే తీసుకుంటే బాగుంటుంది.

The submit అప్పుడు ‘దేవర’ ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’.. బావకి మరో సినిమా? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.