స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా బ్రేక్ తీసుకొని తనపైనే సోలో సినిమాలు చేసే స్టేజ్ కి వచ్చింది. తెలుగులో కొన్నేళ్ల బ్రేక్ తీసుకొని వచ్చినప్పటికీ తన క్రేజ్ అండ్ మార్కెట్ అదే రేంజ్ లో ఉన్నాయని తన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం సినిమాతో ప్రూవ్ చేసింది. ఆల్రెడీ భారీ లాభాలతో సామ్ ర్యాంపేజ్ చూపించింది. తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఆమె సినిమా విధ్వంసం సృష్టిస్తుంది.
ఇలా యూఎస్ మార్కెట్ లో ఈ ఏడాదిలో ఏ టాలీవుడ్ సినిమా సెట్ చేయని రికార్డ్ నెంబర్ సెట్ చేసిందట. అక్కడ ఈ రెండో మంగళవారం 70 వేల డాలర్లకి పైగా గ్రాస్ రాబట్టి బిగ్గెస్ట్ సింగిల్ డే గ్రాసర్ గా నిలిచినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇలా సినిమా 2 మిలియన్ డాలర్ గ్రాస్ కి అతి చేరువలో ఉందని చెప్పొచ్చు. దీనితో సమంత సెన్సేషన్ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సమంత నిర్మాణం వహించింది.
The submit ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్.. రెండో మంగళవారం రికార్డ్ నంబర్స్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
