Tue. Jul 7th, 2026

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ మేకర్స్ ఇటీవల రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రేజీ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, ఈ సినిమాలో ఒక వినూత్నమైన ట్రైన్ ఎపిసోడ్ ఉండబోతోందని, అది థియేటర్లలో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని తెలుస్తోంది. సిట్యుయేషనల్ కామెడీతో సాగే ఈ సుదీర్ఘమైన సీక్వెన్స్‌ను ఇటీవలనే చిత్రీకరించారని, ఇందులో వెంకటేష్ తన మార్క్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడని టాక్. ఈ ఒక్క ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రంలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ భారీ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

The submit ‘ఆదర్శ కుటుంబం’లో ఆ సీక్వెన్స్ హైలైట్ కానుందట..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.