Tue. Jul 7th, 2026

లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో భారీ చిత్రం “నాగ బంధం” కూడా ఒకటి. యువ హీరో విరాట్ కర్ణ హీరోగా తన రెండో సినిమాకే 100 కోట్ల రేంజ్ ప్రాజెక్ట్ ని అందుకొని చేసాడు. దర్శకుడు అభిషేక్ నామ తెరకెక్కించిన ఈ గ్రాండియర్ సినిమా గట్టి ప్రమోషన్స్ నడుమ మంచి బజ్ ని క్రియేట్ చేసి విడుదలకి వచ్చింది.

డే 1 కి మంచి బుకింగ్స్ నే అందుకున్న ఈ సినిమా అనుకున్న రేంజ్ లో యూనానిమస్ టాక్ ని అయితే అందుకోలేదు. దీనితో బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఎలా ఉంది అనేది ఇంట్రెస్ట్ గా మారింది. ఇక ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా తాలూకా రెండు రోజుల వసూళ్ళని అనౌన్స్ చేశారు.

ఈ సినిమా రెండు రోజుల్లో 13.14 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టు చెబుతున్నారు. మంచి బజ్ తో వీకెండ్ కి బుకింగ్స్ అయితే సినిమాకి బాగానే కనిపిస్తున్నాయి. సో వారాంతంకి డీసెంట్ నంబర్స్ అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి జునైద్ కుమార్, అభే లు సంగీతం అందించగా కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాణం వహించారు.

The put up బాక్సాఫీస్ దగ్గర ‘నాగ బంధం’ పరిస్థితేంటి? 2 రోజుల వసూళ్లు ఎంతంటే! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.