Tue. Jul 7th, 2026

అక్కినేని వారి యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “లెనిన్”. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా తాలూకా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి కింగ్ నాగార్జున కూడా వచ్చారు. అభిమానుల కోలాహలంతో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్ లో నాగార్జున తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ తన కెరీర్ 100వ సినిమా “కింగ్ 100” పై ఓ క్లారిటీ షేర్ చేయడం ఎంతో కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న వారికి అందించారు.

తన అవైటెడ్ ప్రాజెక్ట్ పై ఈ జూలై 10 తర్వాత అప్డేట్ అందిస్తామని ఖరారు చేశారు. దీనితో ఫ్యాన్స్ కి లెనిన్ రిలీజ్ అయ్యిన వెంటనే కింగ్ 100 పై కూడా ఓ క్లారిటీ రావడం అనేది వరుస ట్రీట్ లు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి నాగవంశీ, నాగార్జున నిర్మాణం వహించగా థమన్ సంగీతం అందించాడు.

The submit కింగ్ 100: ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ క్లారిటీ షేర్ చేసిన నాగార్జున! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.