Tue. Jul 7th, 2026

హీరో రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఇరుముడిలో ఓ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందని.. అది ఓ గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. మరి ఆ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్, ఇరుముడి కి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. రవితేజ ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని అంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ ఈ గెస్ట్ రోల్ ను పెట్టాడట.

ముఖ్యంగా రవితేజ – ఈ గెస్ట్ రోల్ పాత్రల మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.

The put up ‘రవితేజ’ ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజింగ్ రోల్ ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.