Mon. Jul 6th, 2026

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఉపశమనం కలిగించింది. ఆయన ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉండటంతో, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించింది.

ఈ కేసు విచారణను కోర్టు జూలై 29, 2026కు వాయిదా వేసింది. డిసెంబర్ 2024లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ప్రస్తుతం ప్రీ-ట్రయల్ దశలో ఉంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో ‘రాకా’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది లోపు షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

The put up సంధ్య థియేటర్ కేసు: అల్లు అర్జున్‌కు కోర్టు ఉపశమనం.. వర్చువల్ హాజరుకు అనుమతి! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.