Mon. Jul 6th, 2026

జర్నలిస్ట్ నుండి ‘టాక్సీవాలా’, ‘బేబి’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, తాజాగా తన సరికొత్త చిత్రం “చెన్నై లవ్ స్టోరీ”ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతం అందించారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ఎస్ కేఎన్, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను మరియు హైలైట్స్‌ను పంచుకున్నారు.

– చెన్నైలో నివసించే ఒక తెలుగు జంట కథ కాబట్టే ఈ చిత్రానికి “చెన్నై లవ్ స్టోరీ” అని పేరు పెట్టాము. ‘బేబి’ బ్లాక్ బస్టర్ తర్వాత పెరిగిన అంచనాలకు తగ్గట్లుగా, నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ అందించిన అద్భుతమైన కథతో రావాలనే ఏడాది సమయం తీసుకున్నాం. ప్రస్తుతం తెలుగు విడుదల పనులు శరవేగంగా జరుగుతుండగా, తమిళంలో కొన్ని పెద్ద సినిమాలు ఉండటం వల్ల తమిళ వర్షన్‌ను అదే వారం రిలీజ్ చేయాలా లేదా ఒకటి, రెండు వారాలు ఆగి తేవాలా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.

– ఈ సినిమా కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశాడు. ఆయన నటనలోని సరికొత్త మెచ్యూరిటీ వల్ల ఈ ఏడాది అవార్డ్స్ నామినేషన్స్‌లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా, నిర్మాతగా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ.. ఇప్పుడు దర్శకుడిగా కూడా మారుతున్న కిరణ్‌కు సినిమాపై ఉన్న ప్యాషన్‌ను ఈ షూటింగ్ సమయంలో స్వయంగా చూశాను.

– సాయి రాజేష్ కథల్లో హీరోయిన్ పాత్రకు ఉండే ప్రాధాన్యతను బట్టి, ఈ చిత్రంలో ప్రారంభం నుంచే ఉండే బలమైన పాత్ర కోసం తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియను ఎంపిక చేశాం. ఆమె ఈ క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేసిందని ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరు చెబుతారు. ‘బేబి’ సినిమాలో తొలి ప్రేమను చూపిస్తే, ఈ చిత్రంలో మలి ప్రేమ కూడా గొప్పదే అని ఎమోషనల్‌గా చెప్పబోతున్నాం. అయితే ఇందులో ఎలాంటి ట్రాజెడీ ఉండదు. ‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల సమయం తీసుకుని ఈ సినిమాను నిర్మించామంటే ఇందులో మాదైన ప్రత్యేక మార్క్ ఉంటుంది.

– ఈ సినిమాకు అవసరమైన ఎమోషన్స్, విజువల్ బ్యూటీ కోసం ఏపీలోని చీరాల, వైజాగ్ బీచ్‌లతో పాటు చెన్నై లైట్‌హౌస్, చెన్నై మెట్రో మరియు పాండిచ్చేరి వంటి పలు లొకేషన్లలో సహజత్వం ఉట్టిపడేలా షూటింగ్ చేశాం. కథ డిమాండ్ మేరకు వర్షం, సూర్యోదయం సీన్స్ కూడా నాచురల్‌గా వచ్చేంతవరకు ఓపికగా వేచి చూసి తీయడం వల్లే షూటింగ్ రోజులు పెరిగాయి. సినిమాకు కావాల్సిన రైట్ ఎమోషన్స్, బెస్ట్ క్వాలిటీ ఔట్‌పుట్‌ను రాబట్టుకున్నాం.

– ‘బేబి’ చిత్రానికి కల్ట్ లవ్ స్టోరీగా పేరొస్తే, ఈ సినిమాకు క్లాసిక్ లవ్ స్టోరీ అనే గుర్తింపు వస్తుంది. కథ విన్న వెంటనే ఒప్పుకున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ, భావోద్వేగాలకు తగ్గట్టుగా అద్భుతమైన మెచ్యూర్డ్ మ్యూజిక్ ఇచ్చారు. అనంత శ్రీరామ్ సింగిల్ కార్డ్ లిరిక్స్ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటాయి. మాతో ఎప్పటినుంచో ట్రావెల్ అవుతున్న దర్శకుడు రవి నంబూరి మంచి టాలెంటెడ్ టెక్నీషియన్. ఆయన డైలాగ్స్ బాగా రాస్తాడు. కథా రచయిత సాయి రాజేష్ అందరికీ పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించుకుంటారు. అందుకే ఆయనకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

– సినిమాకు రిలీజ్ రోజే అత్యంత కీలకం. ‘కలర్ ఫోటో’, ‘బేబి’ వంటి చిత్రాల వల్లే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘బేబి’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు వచ్చినప్పుడు కొన్ని వివాదాలు సహజమేనని.. అయితే “చెన్నై లవ్ స్టోరీ”లో అలాంటి వివాదాస్పద కంటెంట్ ఏదీ ఉండదు. ఇది పూర్తిగా ఎమోషనల్ డెప్త్‌తో సాగే అందమైన కథ.

– ఓటీటీ సంస్థలు సినిమాల రిలీజ్ డేట్స్‌ను ముందే చెప్పడం వల్ల ఎలాంటి ఒత్తిడి ఎదురుకాలేదు. “చెన్నై లవ్ స్టోరీ” ఓటీటీ డీల్ ఇప్పటికే పూర్తయింది. సినిమా కలెక్షన్లపై ముందే మాట్లాడటం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అయితే ఈ చిత్రం ‘బేబి’ లాగే మాకు మంచి పేరు, ఒక ప్రత్యేక మార్క్ తెస్తుందనే నమ్మకం ఉంది. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచడం లేదు. ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. వాటిని త్వరలోనే అనౌన్స్ చేస్తాను.

The submit ఇంటర్వ్యూ : ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ – ‘చెన్నై లవ్ స్టోరీ’ మా బ్యానర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుంది..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.