ఇండియన్ సినిమా దగ్గర మంచి మార్కెట్ సొంతం చేసుకున్న అగ్ర తారల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతూ ఉండగా దీనికి సంబంధించి బిజినెస్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
ఈ సినిమా కన్నడ డబ్బింగ్ రైట్స్ ని పీపుల్ మీడియా, ఆసియన్ సంస్థకి అమ్మినట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే పీపుల్ మీడియా వారికి హక్కులు ఇవ్వడం వెనుక ప్రభాస్ ప్రధాన కారణం అన్నట్టు టాక్ నడుస్తుంది. ఆదిపురుష్ మూలాన వచ్చిన నష్టాలకి భరోసాగా రాజా సాబ్ చేసాడు. కానీ అది కూడా అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయనుందున మరొక్క అవకాశాన్ని ఈ రూపంలో ఇచ్చినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈసారి మాత్రం ముందు రెండు సినిమాల్లా మిస్ ఫైర్ అవ్వడం జరగదనే చెప్పొచ్చు. మెయిన్ గా ప్రభాస్ తో పాటుగా దర్శకుడు సందీప్ వంగ ఫ్యాక్టర్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుండడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేయడం ఖాయం. సో ఇప్పుడైతే ముందులా తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువే..
The put up అందుకే మళ్ళీ ప్రభాస్ వారికి అవకాశం ఇచ్చాడా? ఈసారి మిస్ ఫైర్ అవ్వదు first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
