Thu. Jul 23rd, 2026
Jananayagan : విజయ్ ‘జననాయకుడు’ ఓవర్సీస్ రివ్యూ.. వద్దు బ్రో

కోలీవుడ్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్ తెలుగులో జన నాయకుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో బిజినెస్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్ మరియు తొలి షోల నుంచి వస్తున్న స్పందన మాత్రం నిరాశపరిచేలా ఉంది.

బాలయ్య హిట్ సినిమా భగవంత్ కేసరి రీమేక్ గా వచ్చిన సినిమా ప్రారంభం కొన్ని టెంప్లేట్ ఎలివేషన్ సీన్లు మినహా కథనంలో ఎక్కడా సరైన నేపథ్యం లేదు. అయితే ఇంటర్వెల్ సీన్ మాత్రమే కాస్త ఊరటనిచ్చేలా ప్రధాన హైలైట్‌గా నిలిచింది. విజయ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాని అక్కడక్కడా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ, దర్శకుడి రొటీన్ ఫ్లాట్ మేకింగ్ కారణంగా సినిమా పట్టుతప్పింది. కథను నడిపించడంలో దర్శకుడు హెచ్. వినోద్ పూర్తిగా తడబడ్డారు.   (భగవంత్ కేసరి నుండి కుమార్తె సెంటిమెంట్‌ను కొర్ పాయింట్ గా తీసుకున్నప్పటికీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఎమోషన్ పండలేదు. ఇక విలన్‌గా నటించిన బాబీ డియోల్ పాత్ర  పూర్ గా కొన్నిచోట్ల నవ్వు తెప్పించేలా డిజైన్ చేశారు. వీఎఫ్ఎక్స్ వర్క్, ఎడిటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా లేకపోవడం ప్రధాన లోపంగా మారింది.

సినిమాలోని ప్రధాన సన్నివేశాలన్నీ ఎటువంటి సరైన ఫ్లో లేకుండా ఒకదాని తర్వాత ఒకటి చుట్టేసినట్లుగా అనిపిస్తాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఆశించనంత ఉండదు.  మొత్తానికి ‘జన నాయగన్ చిత్రం విజయ్ మాస్ ఇమేజ్ మరియు అనిరుధ్ మ్యూజిక్ మీదే నడిచే ప్రయత్నం చేసినప్పటికీ బలహీనమైన కథనం పూర్ డైరెక్షన్ తీరు వల్ల ‘ డిసప్పాయింటింగ్ అనిపించుకుంటోంది.