వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
జూన్‌లో రెండు భాషల్లో కలిపి దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మూఢనమ్మకాలు, “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” అనే ఆసక్తికర కాన్సెప్ట్ ఆధారంగా దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్’ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ వినోదాత్మక పాత్రలో అలరించగా, నవీన్ చంద్ర నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణసాయి, రాగిణి ద్వివేది ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఛాయాగ్రహణం అందించగా.. ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో స్వరాలు సమకూర్చారు. థియేటర్లలో మంచి స్పందన లభించిన ఈ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలోనూ వీక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
The submit జూలై 31 నుంచి ‘అమెజాన్ ప్రైమ్’లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
