మన టాలీవుడ్ టాలెంటెడ్ పవర్ హౌస్ నటుడు సత్యదేవ్ హీరోగా హీరోయిన్ దీపా థామస్ కలయికలో దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన మరో వినూత్న చిత్రమే రావు బహదూర్. విమర్శకులు, అనేకమంది సినీ ప్రముఖులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
అందులో ఈ సినిమా గ్రాండ్ గా నేడు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాని అపుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈసారి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాలో వికాస్ ముప్పాల, దర్శకుడు వెంకటేష్ మహా కూడా సాలిడ్ రోల్స్ చేశారు. అలానే స్మరన్ సాయి సంగీతం అందించిన ఈ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సహకారాన్ని అందించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
The submit ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘రావు బహదూర్’! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
