Sun. Aug 2nd, 2026

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాతో మరోసారి నానిని రఫ్ అండ్ రగడ్ లుక్‌లో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆగస్టు 6న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సినిమా నుంచి నాని ‘జడల్’ పాత్రకు సంబంధించి ఓ పవర్‌ఫుల్ స్టిల్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ బ్యాగ్‌ను జడల్ సాలిడ్‌గా పంచ్ కొడుతున్న ఈ పిక్‌తో అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెంచారు.

ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The submit ఆగస్టు మొదలు.. జడల్ జమానా షురూ అంటూ పంచ్ కొట్టిన నాని..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.