‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మంచి జోష్‌లో ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. కిరణ్‌తో రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వైట్ అండ్ వైట్ ‘రెడ్డి’ గెటప్‌తో సినిమా చేయాలనుందని తెలిపారు. అయితే, ‘క‘, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి సినిమాల్లో పక్కింటి కుర్రాడి పాత్రలతో విజయాలు అందుకున్న కిరణ్‌కు ఫ్యాక్షన్ జానర్ పెద్ద రిస్క్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘దిల్ రుబా’లో బలవంతపు హీరోయిజం వర్కౌట్ కాకపోవడమే అందుకు ఉదాహరణ. ఇదిలా ఉంటే, కిరణ్ అబ్బవరం ఇప్పుడు మెగాఫోన్ పట్టి తన సొంత దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో ఆయన చెఫ్ పాత్రలో కనిపించనుండగా, ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. మరి నిజంగానే కిరణ్ అబ్బవరం ఫ్యాక్షన్ డ్రాప్బ్యాక్తో సినిమా చేస్తాడా అనేది చూడాలి.
The put up ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కిరణ్ అబ్బవరం.. సెట్ అయ్యేనా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
