కింగ్ నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్ఎ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆమె నటిస్తున్న పాత్రకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో టబు నెగిటివ్ షేడ్స్ ఉన్న మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ పవర్‌ఫుల్ రోల్‌ను ప్రస్తుతానికి చిత్ర యూనిట్ చాలా సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తయింది. టబుపై వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను కూడా మేకర్స్ విజయవంతంగా ముగించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను, ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి నిజంగానే నాగార్జున ప్రెస్టీజియస్ మూవీలో టబు ఇలాంటి నెగిటివ్ పాత్రలో కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
The submit ‘కింగ్ 100’లో ఆ సీనియర్ బ్యూటీ చేసేది అలాంటి రోల్..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
