టాలీవుడ్‌లో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు Satyadev Kancharana, చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి ఇప్పుడు లీడ్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. కష్టపడి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఓ సంఘటనను తాజాగా తన ‘రావు బహదూర్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సత్యదేవ్ పంచుకున్నారు.ః
Additionally Learn : Samyuktha Menon: 45 డిగ్రీల వేడిలో షూటింగ్.. సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘నేను ఒక సినిమాలో మహేష్ బాబు గారితో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకున్నాను. షూటింగ్ సమయంలో మహేష్ బాబు నా భుజం మీద చేయి వేసి మాట్లాడారు. ఆ ఆనందంలో ఊరంతా తిరిగి మహేష్ బాబు గారితో సీన్ చేశానని చెప్పేశాను. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్తే.. ఆ సీన్ ఎడిటింగ్‌లో లేదు. పోలీసులు వచ్చి చెప్పడంతో ఆ సీన్ తీసేయాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది’ అంటూ నవ్వుతూ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో పక్కన సీన్ కట్ అయితే ఏ నటుడైనా నిరాశ చెందుతారు. కానీ సత్యదేవ్ అలాంటి దశల నుండి వచ్చి ఈరోజు వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ వంటి పీరియాడిక్ డ్రామాలో లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగారు.
