Mon. Jul 27th, 2026

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. అనౌన్స్ చేసిన నాటి నుంచే మంచి పాజిటివ్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంని మేకర్స్ ది ప్యారడైజ్ డేట్ ఆగష్టు 21కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా సినిమా వాయిదా పడింది అని ఏకంగా డిసెంబర్ కి వెళ్ళిపోయింది అంటూ వచ్చిన రూమర్స్ ఫ్యాన్స్ ని నిరాశకి లోను చేసాయి.

కానీ వీటికి చెక్ పెడుతూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా రవితేజ సన్నిహిత వర్గాల నుంచి కూడా అనుకున్న సమయానికే ఇరుముడి ఆగమనం అని ఖరారు చేశారు. అయితే ఇక్కడ నుంచే అసలు టెస్ట్ మొదలు అని చెప్పాలి. సినిమా నుంచి ఇప్పటికి తక్కువ కంటెంట్ నే విడుదల చేశారు కానీ చేసింది హిట్టయ్యింది.

ఇప్పుడు సమయం తక్కువ ఉంది కాబట్టి కాలయాపన చేయకుండా సినిమా అప్డేట్స్ వరుసగా వదలాల్సిందే. మరి వీటిని ఎలా ప్లాన్ చేసి ఆడియెన్స్ ముందుకు సినిమా తీసుకొస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

The put up అనుకున్న సమయానికే ‘ఇరుముడి’.. ఇక అసలు టెస్ట్ మొదలు! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.