మెగాస్టార్ చిరంజీవి తనది గొప్ప మనసు అని మరోసారి చాటుకున్నారు. తోటి కళాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఆయన ఎప్పుడు ముందు ఉంటారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేశ్ కుటుంబానికి మెగాస్టార్ అండగా నిలిస్తూ.. చికిత్స ఖర్చులకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి చెప్పారు.
ఇక మరో మెగా బ్రదర్ నటుడు నాగబాబు కూడా తన వంతు సాయంగా రమేశ్ కుంటుంబానికి రూ.2లక్షల చెక్కును అందజేయడం విశేషం. రమేశ్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని మెగా ఫ్యామిలీ ఆకాంక్షించింది. ఇక నటుడు రమేశ్ ‘గబ్బర్ సింగ్’తో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
The publish మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్ ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
