మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మోస్ట్ లవబుల్ హీరో అయినటువంటి వెంకీ మామ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘ఆదర్శ కుటుంబం’. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో నారా వారి హీరో నారా రోహిత్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు తన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ బర్త్ డే విషెస్ చెబుతూ తన లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు.
అయితే ఇందులో రోహిత్ మంచి డైనమిక్ లుక్ లో కనిపిస్తుండగా బ్యాక్గ్రౌండ్ లో తెలంగాణ పోలీస్ బోర్డు కనిపిస్తుంది. సో దీంతో తాను ఈ సినిమాలో పోలీస్ రోల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఓ మాస్ పోలీస్ ఆఫిసర్ గా తాను కనిపించనున్నారని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ 2న సినిమాని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
The publish ‘ఆదర్శ కుటుంబం’ నుంచి నారా హీరో లుక్, రోల్ రివీల్! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
