మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో రవితేజ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను భక్తి మరియు ఎమోషన్స్ కలబోతగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఇరుముడి కట్టు’ను జూన్ 29వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ఆయన ఈ సినిమా పాటలపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ చిత్రాన్ని 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.
The publish ఇరుముడి : ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఇరుముడి కట్టు’తో వస్తున్న రవితేజ.. ఎప్పుడంటే..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
