Thu. Jul 23rd, 2026

ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న సూపర్ హీరో పాత్రల్లో హాలీవుడ్ నుంచి ‘హీ మ్యాన్’ కూడా ఒకటి. కామిక్స్, కార్టూన్స్ లో ఎంతో పాపులర్ అయ్యిన ఈ రోల్ పై సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఈ కొత్త జెనరేషన్ లో రిలీజ్ కి వచ్చిన తాజా చిత్రమే ‘హీ మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’. ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర అనుకోని విధంగా ప్లాప్ ఫలితాన్నే మూటగట్టుకోవాల్సి వచ్చింది.

మన దగ్గర కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యిన ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో హీరో రోల్ కి యంగ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. అలాగే మరో కీలక పాత్రకి వెర్సటైల్ నటుడు రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో తెలుగులో కూడా ఈ చిత్రం ప్లాప్ గానే మిగిలిపోయింది.

ఇలా థియేటర్స్ లో మిస్ ఫైర్ అయ్యిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ కి తీసుకొచ్చారు. ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

సో ఫాంటసీ విజువల్ వండర్ ని చూడాలి అనుకుంటే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూడవచ్చు, ఎలాంటి రెంటల్ లో లేదు. ఇక ఈ చిత్రంలో హీరోగా నికోలస్ గలిట్జినే నటించగా ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించారు. అలాగే ఎం జి ఎం స్టూడియోస్ నిర్మాణం వహించారు.

The publish ఓటిటిలోకి వచ్చేసిన ‘హీ మ్యాన్’ కొత్త సినిమా.. నిఖిల్, రావు రమేష్ లు డబ్బింగ్ చెప్పిన సినిమా ఎందులో అంటే first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.