Thu. Jul 23rd, 2026

దళపతి విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తున్న ‘జన నాయగన్’ చిత్రంలో పూజా స్క్రీన్ టైమ్‌ను ఎడిటింగ్‌లో గణనీయంగా తగ్గించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో జర్నలిస్ట్‌గా నటించిన పూజా పాత్రకి సంబంధించి కొన్ని సన్నివేశాలను దర్శకుడు హెచ్. వినోద్ ఎడిట్ చేశారట.

సినిమా వేగాన్ని పెంచడానికి, విజయ్ పాత్రతో పాటు కథలోని రాజకీయ డ్రామాపైనే ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ​’బీస్ట్’ తర్వాత విజయ్-పూజా కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. సెన్సార్ ఆలస్యాలు, ఆ తర్వాత మేకర్స్ చేసిన పలు మార్పులు, కొత్త సన్నివేశాలు, పాటల జోడింపు వంటి ఎడిటింగ్ మార్పులే పూజా పాత్ర నిడివి తగ్గడానికి కారణమని తెలుస్తోంది.

మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించగా, రేపే(జూలై 24) థియేటర్లలో విడుదల కానుంది.

The submit జన నాయగన్ : పూజాకి తప్పని కోతలు.. చాలా లేపేశారట..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.