Thu. Jul 23rd, 2026

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ మూవీ నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

ఓ డ్యాన్స్ నెంబర్‌గా రాబోతున్న ఈ సెకండ్ సింగిల్ సాంగ్ ఖచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాటను జూలై 25న రిలీజ్ చేయనుండగా, దీని ప్రోమోను జూలై 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ఈ పాటలో మంచి డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

The put up ‘విశ్వనాథ్ & సన్స్’ సెకండ్ సింగిల్ సాంగ్.. టైమ్ లాక్ చేసిన మేకర్స్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.