Mon. Jul 6th, 2026

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ అనే ఆసక్తికరమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు. 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనదైన వినూత్న కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన అహల్య, అయాన్ మరియు షాలిని కొండేపూడి తమ సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. నెట్‌ ఫ్లిక్స్ తన ‘కమింగ్ సూన్’ (త్వరలో రాబోయే తన చిత్రాల లిస్ట్ లో) విభాగంలో ఈ చిత్రాన్ని చేర్చింది. 2026 జూలై 9న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని ధృవీకరించింది. పైగా వివిధ ప్రాంతాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ఈ చిత్రం పలు భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది కొత్త నటీనటులతో, లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

The publish ఓటీటీ : ‘సింగ్ గీతం’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన నెట్‌ ఫ్లిక్స్ ! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.