తమిళ స్టార్ హీరో సూర్య, ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ‘కర్ణ’ అనే పౌరాణిక చిత్రం కోసం జతకట్టారు. కానీ, బడ్జెట్ పరిమితుల కారణంగా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఐతే, ఈ పీరియడ్ డ్రామా కోసం సల్మాన్ ఖాన్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో చేతులు కలపనున్నారని బాలీవుడ్ మీడియాలో రీసెంట్ గా వార్తలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న తాజా అప్ డేట్ ప్రకారం, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తన ‘కర్ణ’ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తీస్తున్నారట.
సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో యాక్ట్ చేసున్నాడని.. ఈ విషయం పై తుది నిర్ణయం కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అభిమానులు కూడా సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తే బాగుంటుందని పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, భారతీయ సినిమాలోని ప్రస్తుత అతిపెద్ద స్టార్లలో మరొకరు మహాభారతంలోని పాత్రను పోషించినట్టు అవుతుంది. కల్కిలో ప్రభాస్ కర్ణ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. మరి ఇప్పుడు సల్మాన్ కూడా కర్ణ పాత్రలో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.
The submit కర్ణ సినిమాలో సల్మాన్ ఖాన్.. ఖాయమేనా ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
