Tue. Jul 7th, 2026

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతుంది. ఐతే ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్ లో బాలయ్య పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీయబోతున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసమే సుమారు 20 రోజులకు పైగా షూటింగ్ సాగనుంది. ఇక కొరటాల శివ సినిమా అనగానే.. కథ కంటే కూడా కథా నేపథ్యమే ఎక్కువగా గుర్తుకొస్తోంది. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉంది. నేపథ్యం చుట్టూ.. ఆ ప్రాంతపు జీవన శైలిని సైతం కొరటాల, తన సినిమాలో చాలా బలంగా చూపిస్తారు.

ఐతే, ఇప్పుడు బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా నేపథ్యం ఏమై ఉంటుంది ? అంటూ చర్చ మొదలు అయింది. ఇక రీసెంట్ గా వచ్చిన రూమర్ ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

The put up బాలయ్యతో కొరటాల శివ లాంగ్ షెడ్యూల్ ? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.