టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ గారి మనవడు జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీకి పరిచయం అవుతూ, దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రంతో ప్రేక్షకుల మందుకు రానున్నాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమాను వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. చాలా రోజులుగా ఈ టైటిల్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు అఫీషియల్‌గా ఇదే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూతురు రషా తడాని టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.
The put up ఘట్టమనేని వారసుడితో ‘శ్రీనివాస మంగాపురం’ చూపించనున్న అజయ్ భూపతి first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
