అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “లీసా”. జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని ప్రవాస భారతీయులు వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐలా నిర్మిస్తుండగా.. సతీష్ రెడ్డి మాసం స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “లీసా” తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ చేయని ఓ భిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు దర్శకుడు కష్టపడి పనిచేశారని, సతీష్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారని ప్రశంసించారు. ఈ సినిమా హిట్టైతే నిర్మాతలకు మరో సినిమా ఉచితంగా చేసిపెడతానని ఆమె ప్రకటించడం విశేషం.
దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ.. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందన్నారు. అనన్య నటన అందరినీ కట్టిపడేస్తుందని చెప్పారు. ఈ మూవీలో ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని, బడ్జెట్ పరిమితుల్లో వేగంగా షూటింగ్ పూర్తిచేయడానికి అనన్య సహకారం ఎంతో ఉందని డీవోపీ సతీష్ రెడ్డి తెలిపారు.
నిర్మాతలు వెంకట్, రామకృష్ణ మాట్లాడుతూ.. కేవలం విదేశాల నుంచి వచ్చి సినిమా తీసి వెళ్లిపోవాలని కాకుండా, ఓ బలమైన కథతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామన్నారు. అనన్య డెడికేషన్‌ను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ.ఎం.రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ తుమ్మల మధు, నటులు యాదమ్మ రాజు, జెమినీ సురేష్, జాను వర్మ, కిషోర్ దాస్ తదితరులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
The put up ఘనంగా అనన్య నాగళ్ల “లీసా” ఫస్ట్ లుక్ విడుదల first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
