మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. అయితే, తాజాగా వెంకీ పాత్రపై దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేశారు.
ఈ సినిమాలో వెంకటేష్ చేసేది ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ అని.. ఈ పాత్ర ఏకంగా 25 నిమిషాల స్క్రీన్ టైమ్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక ఈ సినిమాలో వెంకీ పాత్ర క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ఎంట్రీ ఇస్తుందని ఆయన లీక్ చేశారు. ఇంకా ఈ పాత్రపై ఎలాంటి విషయాలను రివీల్ చేసినా, ప్రేక్షకులు థియేటర్లలో ఫన్ మిస్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు.
మొత్తానికి మెగాస్టార్ సినిమాలో విక్టరీ వెంకటేష్ అందించబోయే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో అనిల్ రావిపూడి క్లూ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్గా నటిస్తోండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
The publish చిరు సినిమాలో వెంకీ రోల్‌పై అనిల్ రావిపూడి లీక్.. వచ్చేది అప్పుడేనట..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
