Wed. Apr 22nd, 2026

పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’ చిత్రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ తిరుపతి, గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీలో సందడి చేసింది. విద్యార్థుల కేరింతల నడుమ హీరో అభినవ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేసి అలరించారు.

హీరో కావాలన్నది తన చిరకాల కోరికని, ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత ఈ స్థాయికి వచ్చానని అభినవ శౌర్య తెలిపారు. హీరోయిన్ అనుశ్రీ సినిమాలోని డైలాగులు చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని చిత్ర ఆలపించిన పాటను కళాశాలలో ప్రదర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందని దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే తిరుపతిలో స్పెషల్ ప్రివ్యూ షో వేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎర్రపురెడ్డి ఆనంద్ రెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేతలు ఎర్రపురెడ్డి కొండా రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమకు సహకరించిన కళాశాల యాజమాన్యానికి చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

The put up తిరుపతిలో ‘దేవగుడి’ ప్రమోషన్స్.. విడుదలకంటే ముందే స్పెషల్ ప్రివ్యూ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.