#90s సిరీస్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మౌళి ఆ తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ యాక్టర్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలు అందడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
అయితే, తాను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక తాజాగా మౌళి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్‌ను బట్టి ఈ సినిమా ఎలాంటి కామెడీతో రాబోతుందో అర్థమవుతుంది.
ఇక సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఏదేమైనా ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు మౌళి సిద్ధమవుతున్నాడు.
The submit ‘దొంగ నా కొడుకు’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న మౌళి first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
