కమల్ హాసన్ కుమార్తెగా సినీ లోకానికి పరిచయమైన శ్రుతి హాసన్ మొదటి నుంచి గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నటిగా ఇలా తనలోని మల్టీ టాలెంటెడ్ పర్సన్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వచ్చారు. ఐతే, తాజాగా శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు విభిన్న మార్గాల్లో నడవడం ఇష్టం. ఒకే గుర్తింపులో నన్ను నేను బంధించాలనుకోవట్లేదు. నాకు సంగీతం, నటన, రచన అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ అన్నింటి కన్నా ముందు నటిగా ఉండటానికే ఇష్టపడతాను. నాకు అదే ఆనందాన్నిస్తుంది’ అని శ్రుతి తెలిపింది.
శ్రుతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు నచ్చే పాత్రల విషయానికి వస్తే.. నేను శారీరక శ్రమతో కూడిన పాత్రలు చేయాలనే కోరిక నాకు ఉంది. అలాగే, బోల్డ్ పాత్రలను చేసేటప్పుడు కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సినిమా నా వృత్తి జీవితంలో ఒక భాగం. కానీ సంగీతం నా వ్య క్తిగత విషయం. సినిమా నాకు ప్రజలతో ఎలా ఉండాలో నేర్పించింది. ఆ పాఠాలే ఒక సంగీతకారిణిగా, మనిషిగా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’ అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
The submit నాకు ఆ పాత్రలు చేయాలని కోరిక – శ్రుతి హాసన్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
