Mon. Jun 29th, 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోన్న అభిషేక్ నామా భారీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’. విడుదలకు ముందే ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక చిన్న హీరో సినిమా అయినప్పటికీ, బిగ్ స్టార్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం భారీ రేటుకు నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ బిజినెస్‌ను క్లోజ్ చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ప్రాచీన భారతీయ దేవాలయాల రహస్యాలు, అక్కడి నాగబంధం రక్షణలో ఉన్న నిధులు, మరియు మన సంస్కృతి వైభవం నేపథ్యంలో ఈ కథాంశం సాగనుంది. దర్శకుడు అభిషేక్ నామా విజన్‌ను, ఈ కథలోని భారీతనాన్ని నమ్మి నిర్మాతలు నిషిత నాగిరెడ్డి, కిషోర్ అన్నపురెడ్డి ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇంప్రెస్ అయిన దిల్ రాజు, సురేష్ మూవీస్, కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు జీ స్టూడియోస్ వంటి ఇండస్ట్రీ దిగ్గజాలు ఈ సినిమా పాన్-ఇండియా పంపిణీ బాధ్యతలను చేపట్టారు.

ఈ చిత్రాన్ని ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
నైజాం – ఎస్‌విసి సినిమాస్(దిల్ రాజు)
వైజాగ్ – ఎస్‌విసి సినిమాస్ (దిల్ రాజు)
గుంటూరు – అబివిఐ సినిమాస్ (మెట్రో సురేష్)
కృష్ణా – సురేష్ మూవీస్
ఈస్ట్ గోదావరి – సురేష్ మూవీస్
వెస్ట్ గోదావరి – ఆకర్ష్ సినిమాస్
నెల్లూరు – ఎస్ఎఎస్ ప్రమోటర్స్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ (సురేష్ మూవీస్)
సీడెడ్ – శ్రీ గురు రాఘవేంద్ర
నార్త్ ఇండియా – జీ స్టూడియోస్
ఓవర్సీస్ – జీ స్టూడియోస్
కర్ణాటక – కెవిఎన్ ప్రొడక్షన్స్
తమిళనాడు – క్రౌన్ సినిమాస్
కేరళ – గుడ్ ఫెలాస్ ఎన్ ఫిలింస్

The publish ‘నాగబంధం’ కోసం బడా డిస్ట్రిబ్యూటర్స్.. ఎక్కడెక్కడ ఎవరంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.