న్యాచురల్ స్టార్ నాని జూలై నెల మొదలైన సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో నాని లాంగ్ హెయిర్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తూనే.. తనకు గాయమైనట్లు అప్డేట్ ఇచ్చాడు.
ఆయన ఎడమచేతి మోచేతికి బ్యాండేజ్ కట్టి ఉండటం ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ధురంధర్’ చిత్రంలోని పాపులర్ డైలాగ్ “ఘాయల్ హూ… ఇస్లియే ఘాతక్ హూ’ అనే లైన్‌ను నాని కోట్ చేశాడు. తనకు దెబ్బ తగిలినప్పటికీ, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం సిద్ధంగా ఉన్నట్లు నాని పేర్కొన్నాడు. ఈ క్రేజీ అప్డేట్తో జూలై నెలను ప్రారంభించిన నాని.. త్వరలోనే తన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్‌తో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యూనివర్సల్ అప్పీల్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
The publish పిక్ టాక్ : గాయపడ్డాను కాబట్టే డేంజర్.. అంటున్న నాని..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
