Wed. Apr 29th, 2026

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ భారీ హైప్ ని సెట్ చేసుకుంది. ఇక ఈ సినిమా నుంచి రెండో సాంగ్ గా ఫుల్ మాస్ నెంబర్ ని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఈ మార్చ్ 2న రాబోతుండగా ఈ సాంగ్ కోసం మరింత హైప్ ని అభిమానులు పెంచుకున్నారు.

అయితే ఈ సాంగ్ పై మరో క్రేజీ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. అదేంటంటే ఈ సాంగ్ ని ఏ ఆర్ రెహమాన్ ఆలపించినట్టు తెలుస్తుంది. రెహమాన్ పాడిన పాటలకి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో తెలిసిందే. సో ఇది డెఫినెట్ గా మరో స్యూర్ షాట్ చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. సో ఆరోజు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి వస్తుంది.

The put up ‘పెద్ది’ మాస్ సాంగ్ కి మరో స్పెషల్ అట్రాక్షన్? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.