అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ జాతర’ (Love Jathara). ‘సమ్మతమే’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసింది.
యూజీ క్రియేషన్స్ (UG Creations) పతాకంపై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
The submit ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ‘లవ్ జాతర’ టీమ్ first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
