Wed. Apr 22nd, 2026

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున పవర్ఫుల్ విలన్ రోల్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సాలిడ్ రివెంజ్ యాక్షన్ డ్రామా కూలీ కోసం అందరికీ తెలిసిందే. గత ఏడాది ఆగస్ట్ లో విడుదల అయ్యిన ఈ సినిమా తమిళ్ లో బుల్లితెర ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు రాలేదు.

కానీ ఫైనల్ గా ఇప్పుడు తెలుగు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు తమిళ్ తో పాటు తెలుగులో కూడా నిర్మాణ సంస్థ సన్ టీవీ వారే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తెలుగులో సన్ జెమినీ టీవీలో ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకి ప్రసారం అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరి ఇంత లేట్ గా వస్తున్న ఈ సినిమాకి తెలుగు ఆడియెన్స్ ఎలాంటి రేటింగ్ అందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ లు కూడా నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

The submit ఫైనల్ గా ‘కూలీ’ తెలుగు వెర్షన్ బుల్లితెరపైకి.. ఎప్పుడంటే! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.