Mon. Jun 29th, 2026

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా నుండి ‘రావణా సందనాలా’ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ అందించిన హై-ఎనర్జిటిక్ మాస్ బీట్స్ ఈ ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మాస్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌కు మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit ‘లెనిన్’ మాస్ జాతర.. ‘రావణా సందనాల’ స్పెషల్ ప్రోమో..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.