దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్ను ఓ అంతర్జాతీయ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన మేజర్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం చిన్న సీన్స్ చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి షూటింగ్‌ను ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ముందుగా ప్రకటించినట్లే 2027 ఏప్రిల్ 7న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఈ అప్డేట్ తొలి అడుగుగా నిలిచింది.
అయితే, షూటింగ్ అక్టోబర్ కల్లా పూర్తయినప్పటికీ, ఆ తర్వాత రాజమౌళి ముందున్న అతిపెద్ద సవాలు భారీ విజువల్ ఎఫెక్ట్స్. గ్రాఫిక్స్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరు కాబట్టి దీనికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విడుదల కానున్నందున, ప్లానింగ్ మిస్ అయితే లాజిస్టికల్ ఇబ్బందులు వస్తాయి. అందుకే అనుకున్న సమయానికే విజువల్ వర్క్ పూర్తి చేసి, సినిమాను సకాలంలో తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది.
ఇక ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ వీడియో అప్డేట్ ఆశిస్తున్నారు. కానీ, రాజమౌళి శైలి ప్రకారం అంత త్వరగా వీడియో కంటెంట్ ఇవ్వడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. ఇప్పటికే ‘వరల్డ్ ఆఫ్ వారణాసి’ గ్లింప్స్ వచ్చేసింది కాబట్టి, ఈ బర్త్‌డేకి వీడియో కాకుండా కేవలం ఒక పవర్ఫుల్ పోస్టర్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
The put up వారణాసి : రాజమౌళి క్లారిటీ.. అయినా మహేష్ ఫ్యాన్స్ కి ఎదురుచూపులు తప్పవా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
