తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. తన 72 ఏళ్ల వయసులో ఆయన నేడు గుండెపోటుతో మరణించారు. కొన్ని నెలల కిందటే ఆయన కుమారుడు గుండెపోటుతోనే చనిపోగా, ఆ బాధతో రఘునాథ్ మానసికంగా కుంగిపోయారు. ఆ బాధలోనే ఆయన నేడు మరణించారు. రఘునాథ రెడ్డి స్వస్థలం విజయవాడ. మొదట్లో ‘ఆకాశ రామన్న’, ‘ ధర్మో రక్షిత రక్షితః’ వంటి నాటకాలతో పేరు తెచ్చుకున్నారు.
కాగా 1991లో శోభన్ బాబు ప్రధాన పాత్రలో పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించిన ‘సర్పయాగం’ సినిమాతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రఘునాథ రెడ్డి సుమారు 370 కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు. గతంలో తనకు మూడుసార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు రఘునాథ్ రెడ్డి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఇక మా 123తెలుగు.కామ్ తరఫున నటుడు రఘునాథ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
The publish విషాదం: సీనియర్ నటుడు మృతి ! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
